![]() |
![]() |

ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో `రెడ్` చిత్రంతో సందడి చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. `ఇస్మార్ట్ శంకర్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్లేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో.. రామ్ స్వల్ప విరామం తీసుకుని ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే.. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి డైరెక్టోరియల్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ బైలింగ్వల్ మూవీలో `ఉప్పెన`ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు.
ఇదిలా ఉంటే.. `#RAPO 19`గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నాడట రామ్. రాబిన్ హుడ్ తరహా పాత్రలో ఆయన క్యారెక్టర్ ఉంటుందట. అంతేకాదు.. నెగటివ్ షేడ్స్ కూడా ఈ పాత్రకి ఉంటాయని సమాచారం. కాగా, కొద్దిరోజుల క్రితం ఇదే సినిమా కోసం రామ్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. మరి.. ఈ రెండు పాత్రల్లో రామ్ చేయబోయే రోల్ ఏంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
త్వరలోనే `#RAPO 19`కి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |